ADB: మాదక ద్రవ్యాల నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక ఆరోగ్య వారోత్సవాలలో భాగంగా శనివారం పట్టణంలో ఔషధ నియంత్రణ, హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ వినియోగంపై నిర్వహించిన ర్యాలీలో కలెక్టర్ పాల్గొన్నారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇటువంటి మందులను విక్రయించడం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు.