NLG: నకిరేకల్ పట్టణ కేంద్రంలో మహాత్మా జ్యోతిరావ్ పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొని పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. సమాజ సంస్కరణకు ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. బహుజన సాధికారత కోసం పూలే ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.