AP: నంద్యాల జిల్లాలోని ప్రముఖ క్షేత్రం శ్రీశైలం దేవస్థానం వెబ్సైట్లో సాంకేతిక సమస్య నెలకొంది. ఆన్లైన్ ద్వారా టికెట్ల బుకింగ్‌కు అంతరాయం తలెత్తింది. బుక్ చేసిన టికెట్లు డౌన్లోడ్ కాకపోవడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెబ్సైట్ బుకింగ్ హిస్టరీలోనూ టికెట్లు బుక్ అయినట్లు చూపించడం లేదు.