MDCL: జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో పదహారేళ్ల మైనర్ బాలిక ఏప్రిల్ 2వ తేదీన తప్పిపోయినట్లుగా తన కుటుంబీకులు తెలిపారు. ఏప్రిల్ మూడవ తేదీన FIR No.304/2026 నమోదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదని, ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని X వేదికగా కోరారు.