AP: విజయవాడ ఫార్మా ట్రైనింగ్ సెంటర్లో మంత్రి గుమ్మడి సంధ్యారాణి ‘పోషణ్ పఖ్వాడా’ను ప్రారంభించారు. ఈ నెల 23 వరకు సాగే ఈ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంలా చేపట్టాలని ఆమె కోరారు. గిరిజన ప్రాంతాల్లో కొత్తగా 130 అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేశామని, రెండేళ్లలోపు పిల్లల మానసిక ఎదుగుదలే లక్ష్యమని పేర్కొన్నారు. గర్భిణీలు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు.