TG: కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజీల మరమ్మతులు వేగంగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. NDSA సూచనల మేరకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, వర్షాకాలం లోపే పరీక్షలు పూర్తి చేయాలన్నారు. ఈ పనుల పర్యవేక్షణకు ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేయాలని, ప్రతి దశలోనూ సీడబ్ల్యూసీ (CWC) సభ్యులు భాగస్వామ్యం అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు.