BDK: అశ్వాపురం మండలంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అమ్మగారిపల్లి గోదావరి నుంచి అనుమతులు లేకుండా ఇసుక తీసుకువస్తున్న డ్రైవర్, యజమానిపై కేసు నమోదు చేశారు. అలాగే జేసీబీని కూడా సీజ్ చేసి సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేశారు. అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.