JN: ప్రతి కుటుంబానికి అంగన్వాడీ సేవలను పక్కాగా చేరవేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. ఇవాళ కలెక్టరేట్లో అంగన్వాడీ టీచర్లకు ఆయన ఫోన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న ఫోన్లను టీచర్లు సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు.