GNTR: గుంటూరులోని జీజీహెచ్లో అగ్నిమాపక పరికరాలను జిల్లా అగ్నిమాపణ అధికారి శ్రీనివాస రెడ్డి గురువారం తనిఖీ చేశారు. వేసవికాలంలో అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు ఆలోచనతో వైద్యశాలలో ఈ అగ్నిమాపక పరికరాలు అన్ని ఉన్నాయా లేదా అనేదానిపై అధికారులతో కలిసి శ్రీనివాస్ రెడ్డి తనిఖీలు చేసి, పరిశీలించారు.