AKP: సుమారు 10 సంవత్సరాలుగా పరారీలో ఉన్న గంజాయి నిందితుడు సయ్యద్ సీనీబ్రహ్ముషా @ శ్రీనుని అరెస్టు చేసినట్లు నర్సీపట్నం రూరల్ ఎస్సై రాజారావు తెలిపారు. అతను 2016 సంవత్సరంలో 625 కేజీల గంజాయి రవాణా కేసులో A2గా ఉన్నాడన్నారు. కోర్టు వాయిదాలకు హాజరు కాకపోవడంతో న్యాయస్థానం ఇచ్చిన నాన్ బెయిల్ వారెంట్‌తో నిందితుడి కోసం గాలింపు చేపట్టి అరెస్ట్ చేశామని తెలిపారు.