వనపర్తి జిల్లా ఏదుల మండలం గొల్లపల్లి, చీర్కపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి వ్యతిరేకంగా రైతులు చేస్తున్న దీక్షకు మద్దతుగా మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు , మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొననున్నారు. అనంతరం అక్కడే భారీ బహిరంగ సభలో వారు ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి సింగిల్ విండో ఛైర్మన్ జగన్నాథం నాయుడు తదితరులు భారీగా బయలుదేరారు.