MDCL: మల్కాజిగిరి MMC కమిషనర్ వినయ్ కృష్ణ రెడ్డిని అల్వాల్ మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి కలిసి పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. లోత్ కుంటలో బస్ షెల్టర్లు, దోమల నివారణ, కొత్త విద్యుత్ స్తంభాల ఏర్పాటు, పెండింగ్ బాక్స్ డ్రెయిన్ పనులను వెంటనే పూర్తి చేయాలని కోరారు. స్పందించిన కమిషనర్, క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.