BDK: ములకలపల్లి మండలం అభివృద్ధి సందడితో కళకళలాడింది. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఇవాళ విస్తృత పర్యటన నిర్వహిస్తూ పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రైతులకు బలమైన భరోసాగా నిలుస్తూ రామచంద్రాపురం, చాపరాలపల్లి గ్రామాల్లో ప్రభుత్వ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.పేదల ఇంటి కలను సాకారం చేస్తూ ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ వేడుకల్లో పాల్గొన్నారు.