ASF: పెంచికల్ పేట్ మండలం బొంబాయిగూడ ఆదర్శ అంగన్వాడీ కేంద్రాన్ని సామాజిక కార్యకర్త చప్పిడి ప్రకాశ్ శుక్రవారం సందర్శించారు. మహిళలకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. అయన మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాలలో పౌష్టికాహారం సకాలంలో పిల్లలకు, మహిళలకు, కిషోర బాలికలకు అందించాలని, పిల్లలకు మెనూ ప్రకారం నాణ్యత విలువలతో కలిగిన రుచికరమైన భోజనం అందించాలని సూచించారు.