AP: రామాయపట్నం పోర్టుపై సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. ఈ సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్ పాల్గొన్నారు. రామాయపట్నం పోర్టు నిర్మాణ పనుల వేగవంతంపై చర్చించారు. పోర్టు కాలపరిమితి పొడిగింపునకు కేబినెట్ సబ్ కమిటీ ఆమోదం తెలిపింది. పోర్టు నుంచి సరకు రవాణా వేగవంతానికి ఔటర్ రోడ్లు, రైలు కనెక్టివిటీపై మాట్లాడారు.