గద్వాల జిల్లా ధరూరు మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారిణి(DEO) విజయలక్ష్మి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల హాజరు పట్టికను పరిశీలించిన ఆమె, ప్రస్తుతం జరుగుతున్న ఎస్ఏ-2 పరీక్షల నిర్వహణను పర్యవేక్షించారు. అనంతరం 2, 4వ తరగతి విద్యార్థులతో ఇంగ్లీష్ ప్రశ్నపత్రాలను చదివించి, బ్లాక్ బోర్డుపై సమాధానాలు రాయించారు.