జగిత్యాల జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి (DRDO) రఘువరన్, కలెక్టర్ సత్య ప్రసాద్‌తో కలిసి గురువారం స్తంభంపల్లి నర్సరీని సందర్శించారు. నర్సరీలో పెంచుతున్న వివిధ రకాల మొక్కలను, వాటి నిర్వహణ తీరును వారు నిశితంగా పరిశీలించారు. పచ్చదనం పెంపొందించడంలో నర్సరీల పాత్ర కీలకమని, మొక్కల సంరక్షణ విషయంలో సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.