AP: విజన్ అనేది ఐదేళ్లకు మాత్రమే ఉండాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. 2024లో అధికారం ఇస్తే 2029కి ఏం చేస్తామనేది ఆలోచించాలని.. కానీ 2047లో చేయబోయేదానికి గురించి ఆలోచించకూడదని తెలిపారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక విభజన హామీలను గాలికి వదిలేశారని మండిపడ్డారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక హామీలపై తమ వైసీపీ పోరాటం చేసిందన్నారు.