NZB: కోటగిరి మండలం సుద్దులం తండాలో శనివారం ఆవు, గేదె జాతికి చెందిన 3 నెలల పైబడిన పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలను ఉచితంగా పంపిణీ చేశారు. పశువైద్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామంలోని పశువులకు టీకాలు వేసి, వ్యాధుల నివారణపై అవగాహన కల్పించారు. డా. సురేశ్ కుమార్ మాట్లాడుతూ.. గాలికుంటు వ్యాధి పశువులకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుందన్నారు.