AP: కడప జిల్లా ఖాజీపేటలో బాలిక కీర్తనను గొంతు కోసి చంపిన విషయం తెలిసిందే. అయితే కీర్తన బంధువులతో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా నిందితుడు వెంకటేష్‌తో పాటు ఉన్న ప్రవీణ్‌పై కూడా కేసు నమోదు చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. ఈ సంఘటన వెనుక ఎవరున్నా వారికి కఠిన శిక్ష పడేలా చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.