AP: అమరావతి నిర్మాణం అనేది పెద్ద కుంభకోణం అని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి విమర్శించారు. అమరావతి పేరుతో విజయవాడ ప్రజలకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. తాము విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. అమరావతి రైతులకు 7 సంవత్సరాలు అవుతున్నా ఎందుకు చంద్రబాబు భూములు కేటాయించలేదని ప్రశ్నించారు. అమరావతి రైతులకు న్యాయం చేసేది వైసీపేనన్నారు.