AKP: ఎస్.రాయవరం మండలం ధర్మవరం వద్ద జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం చెందింది. గాజువాక నుంచి నక్కపల్లి వైపు బైక్పై పప్పల సుజాత వెనక కూర్చుని వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. ఆమెపై నుంచి వాహనం వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. బైక్ నడుపుతున్న వ్యక్తి స్వల్పంగా గాయపడ్డట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.