PLD: మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా శనివారం మాచర్ల పట్టణంలోని పార్క్ సెంటర్లో ఉన్న ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పూలే సమాజ సమానత్వం, విద్యా విస్తరణ కోసం చేసిన సేవలను కొనియాడారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.