ADB: జైనథ్ మండలంలోని బాలాపూర్ గ్రామానికి చెందిన పరమేశ్వర్ పెనుగంగ నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పరమేశ్వర్ ఆదిలాబాద్‌లోని మహలక్ష్మి వాడలో నివాసం ఉంటున్నట్లు తెలిపారు. మహారాష్ట్రలోని పెనుగంగా నది తీరాన మృతదేహం లభ్యమైనట్టు పేర్కొన్నారు. ఆత్మహత్యకు గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.