ASR: అనంతగిరి మండలం జాలాడ నుంచి కుడియా వరకు రహదారి అధ్వానంగా మారి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. రహదారి అంతా కంకర రాళ్లతో ఉండడంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. శనివారం ఇద్దరు ఉపాధ్యాయులు బైక్పై వస్తుండగా వాహనం జారి పడిపోవడంతో స్వల్ప గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. తక్షణమే అధికారులు రహదారి మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.