VKB: విద్యార్థినులు లైంగిక వేధింపులకు గురైతే భయపడకుండా ఫిర్యాదు చేయాలని షీ టీమ్ ఇంఛార్జ్ నర్సింలు సూచించారు. గురువారం పరిగి పట్టణంలోని బాల సదన్ వసతి గృహంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. లోన్ యాప్లు, ఫేక్ కాల్స్లకు మోసాలకు గురైతే వెంటనే 1930 నంబరుకు కాల్ చేయాలని ఆయన కోరారు.