JN: లింగాల గణపురం మండలం పటేల్ గూడెం గ్రామంలో వాటర్ ప్లాంట్ ను స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. వేసవికాలంలో ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీటిని అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తాగునీటి ఎద్దడి లేకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు. మాజీ జడ్పీటీసీ వంశీధర్ రెడ్డి, మార్కెట్ వైస్ ఛైర్మన్ శివకుమార్ ఉన్నారు.