NGKL: కల్వకుర్తి మండలం తోటపల్లిలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను పురస్కరించుకుని మంగళవారం రాత్రి భారీ ర్యాలీ నిర్వహించారు. డీజే చప్పుళ్లు, ఆటపాటల మధ్య యువత ఉత్సాహంగా జెండాలతో ర్యాలీ చేపట్టారు. అంబేద్కర్ ఆశయాలు నేటి తరానికి ఆదర్శమని, ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని వారు పిలుపునిచ్చారు.