MHBD: నెల్లికుదురు మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలుసుకున్న ఎస్సై చిర్ర రమేష్ బాబు స్వయంగా మండుటెండలో కంక్రింట్తో గుంతలను పూడ్పిపించారు. ఎస్సై చొరవ పట్ల వాహనదారులు, ప్రయాణికులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.