KMM: ముదిగొండ మండలం పమ్మి గ్రామంలో మంగళవారం డిప్యూటీ CM మల్లు భట్టి విక్రమార్క పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ.6.50 కోట్ల వ్యయంతో పమ్మి నుంచి కమలాపురం, చిరుమర్రి వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు పనులను ప్రారంభించారు. గ్రామీణ రవాణా సౌకర్యాల మెరుగుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.