GNTR: ఫిరంగిపురం 16వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో శనివారం ‘పోషణ పక్వాడ’ కార్యక్రమం జరిగింది. గర్భిణీ స్త్రీలు, రెండేళ్లలోపు చిన్నారుల సంరక్షణలో ‘తొలి వెయ్యి రోజులు’ అత్యంత కీలకమని సూపర్వైజర్ మున్ని వివరించారు. అలాగే, 3-6 ఏళ్ల పిల్లలకు ఆటపాటలతో కూడిన విద్య అందించడం వారి ఎదుగుదలకు ఎంతో అవసరమని పేర్కొన్నారు. పోషకాహారం ప్రాముఖ్యతపై తల్లులకు అవగాహన కల్పించారు.