నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం, యానంపల్లి గ్రామానికి చెందిన బీ.దీపక్ కుమార్ ఈ నెల ఏప్రిల్ 16 తేది నుంచి 22వ తేది వరకు న్యూ ఢిల్లీలో జరిగే 69వ జాతీయ స్థాయి స్క్వాష్ క్రీడా పోటీలకు ఎంపికయ్యాడని పీడీ రాము తెలిపారు. జిల్లా యువకుడు ఈ ఎంపిక పట్ల యానంపల్లి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, తోట భాస్కర్, బెడద కరుణాకర్ , వీడిసి సభ్యులు అభినందించారు.