AP: రాష్ట్రంలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. నంద్యాల జిల్లాలో అత్యధికంగా 42.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కడపలో 42.7, ప్రకాశంలో 42.6, నెల్లూరు, తిరుపతిలో 42.5 ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. దీంతో సామాన్య ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.