టాలీవుడ్ హీరోయిన్ కృతి శెట్టి తనపై వస్తున్న ‘ఐరెన్ లెగ్’ విమర్శలపై ఆవేదన వ్యక్తం చేసింది. సినిమా జయాపజయాలు తన చేతుల్లో ఉండవని, నటిగా ప్రతి పాత్రకు 100% న్యాయం చేస్తానని తెలిపింది. కేవలం తనను లక్ష్యంగా చేసుకుని విమర్శించడం సరికాదని, అదృష్టం లేక అవకాశాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొంది. ఫలితంతో సంబంధం లేకుండా తన శ్రమను గుర్తించాలని కోరింది.