అన్నమయ్య: మదనపల్లి తాలూకాలో సీఐ కళా వెంకటరావుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. భూవివాదం నేపథ్యంలో గాంధీపురానికి చెందిన దళితుడు రామయ్యను పోలీస్ స్టేషన్కు పిలిపించి, లాఠీలతో దాడి చేసినట్లు ఆరోపిస్తున్నారు. అడ్డుకున్న దళిత మహిళలతో కూడా సీఐ అనుచితంగా ప్రవర్తించి బయటకు తోసేశారని బాధితులు పేర్కొన్నారు. గాయపడిన వారు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.