‘జన నాయగన్’ లీకులపై దర్శకుడు హెచ్ వినోద్ ఇన్స్టా వేదికగా ఆవేదన వ్యక్తం చేశాడు. ‘ప్రతి సీన్ వెనుక ఎంతోమంది కష్టం, కలలు ఉంటాయి. విడుదలకు ముందే సీన్లు లీక్ అవ్వడం బాధాకరం. దయచేసి వీటిని షేర్ చేయకండి, చిత్ర బృందానికి మద్దతుగా నిలవండి’ అని కోరాడు. పైరసీని ప్రోత్సహించకుండా సినిమాను వెండితెరపైనే చూడాలని ఆయన అభిమానులకు విజ్ఞప్తి చేశాడు.