GNTR: జిల్లా వ్యాప్తంగా ద్విచక్ర వాహనాలపై పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఇందులో భాగంగా 600కు పైగా ద్విచక్ర వాహనాలు తనిఖీ చేశారు. 326 వాహనాలకు రూ.4 లక్షల ఛలానాలు విధించి, మైనర్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ ఉల్లంఘనలపై 206 వాహనాలు సీజ్ చేశారు. పట్టుబడిన మైనర్ల తల్లిదండ్రులకు రోడ్డు భద్రతా నియమాలపై జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అవగాహన కల్పించారు.