‘పేట్రియాట్’ ప్రమోషన్స్‌లో నటుడు మమ్ముట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చిత్ర పరిశ్రమలో రాణించాలంటే ఒత్తిడిని తట్టుకోవాలన్నాడు. ప్రతి నటుడు తన చివరి శ్వాస వరకు నటిస్తూనే ఉండాలని కోరుకుంటారని, తాను కూడా నటిస్తూనే మరణించాలని ఆశిస్తున్నట్లు తెలిపాడు. నీరసంగా ఉన్నా సరే, మంచి పాత్ర వస్తే నటుడు వంద శాతం కష్టపడి నటిస్తాడని ఆయన పేర్కొన్నాడు