KRNL: దేవనగర్ సమీపంలో ఉన్న ఎస్టీపీ (మురుగు నీటి శుద్ధి కేంద్రం) ఇవాళ జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి పరిశీలించారు. ప్లాంట్లో మురుగు నీటి శుద్ధి ప్రక్రియ, సామర్థ్యం, నిర్వహణ విధానంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. శుద్ధి చేసిన నీటిని పునర్వినియోగానికి ఉపయోగించే అవకాశాలపై సూచనలు చేశారు. వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.