TG: ఇటీవలే కాంగ్రెస్కు రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరడం దాదాపు ఖాయమైంది. జగిత్యాలలోని ఆయన నివాసం వద్ద ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు వెలిశాయి. జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించడానికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా జగిత్యాలకు బయలుదేరారు. కేటీఆర్ వస్తుండటంతో జీవన్ రెడ్డి ఇంటి వద్దకు భారీగా BRS శ్రేణులు చేరుకుంటున్నారు.