2026 దేశంలో 94% వర్షపాతమే నమోదయ్యే ఛాన్స్ ఉన్నట్లు స్కైమెట్ నివేదిక పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం ఎల్ నినో ప్రభావంతో జూలై-సెప్టెంబర్ మధ్య వర్షాలు తగ్గుతాయి. ముఖ్యంగా ఉత్తర, మధ్య భారతదేశంలో వర్షపాతం తక్కువగా ఉంటుందని అంచనా. తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో సాధారణ వర్షాలు కురిసినా, దేశవ్యాప్తంగా సాగుపై ప్రభావం పడే ప్రమాదం ఉందని అధికారులు రైతులను హెచ్చరించారు.