MLG: జిల్లా గార్ల మండలం సీతంపేటలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర మంత్రి సీతక్క ప్రారంభించారు. రైతులు దళారుల మోసాలకు గురికాకుండా ప్రభుత్వ కేంద్రాల్లోనే అమ్మాలని సూచించారు. మద్దతు ధరతో పంట విక్రయించి లాభాలు పొందాలని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య, చైర్మన్ భానోత్ రాంబాబు పాల్గొన్నారు.