SRPT: మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకగా చేపట్టిన ‘ఇందిరా మహిళా శక్తి’ పథకం జిల్లాలో పట్టాలెక్కుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అదనంగా 40 పెట్రోల్ బంకులను మంజూరు చేయగా, సూర్యాపేట జిల్లాకు 2 కేటాయించారు. ఇందులో భాగంగా హుజూర్ నగర్లో ఒక బంకు ఏర్పాటు ఖరారు కాగా, రెండో దాని కోసం అధికారులు స్థల పరిశీలన చేస్తున్నారు.