దళపతి విజయ్ ‘జన నాయగన్’ ఫుల్ మూవీ లీక్ కావడం కోలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తోంది. దీనిపై నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ తీవ్రంగా స్పందించింది. మూవీ క్లిప్పింగ్స్ షేర్ చేయడం, డౌన్లోడ్ చేయడం చట్టరీత్యా నేరమని, లీకులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు అక్రమంగా కంటెంట్‌ను ప్రసారం చేసే వారిపై చర్యల కోసం లాయర్ నోటీసులు కూడా జారీ చేసింది.