NLG: మునుగోడు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పంచాయతీ భవనం ఉండేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. గట్టుప్పల్ మండలం కమ్మగూడెంలో రూ.20 లక్షలతో నిర్మించిన నూతన జీపీ భవనాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామస్తులకు పంచాయతీ పాలకవర్గ సభ్యులు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు.