NZB: రెంజల్ మండలం కందకుర్తిలో ఈనెల 11న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పర్యటన నేపథ్యంలో చేపట్టిన ఏర్పాట్లను కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం పరిశీలించారు. కందకుర్తిలో స్ఫూర్తి మందిరాన్ని మోహన్ భగవత్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో బోధన్ సబ్-కలెక్టర్ వికాస్ మహతో, ఏసీపీ శ్రీనివాస్, రెంజల్ తహసీల్దార్, ఆర్&బీ డీఈతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.