AP: సీఎం చంద్రబాబుపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. సీఎంపై నమ్మకంతోనే రైతులు స్వచ్ఛందంగా రాజధానికి భూములిచ్చారని తెలిపారు. రాబోయే రోజుల్లో వైసీపీకి పుట్టగతులు లేకుండా చేస్తారని హెచ్చరించారు. రాష్ట్ర బడ్జెట్ మొత్తాన్ని అమరావతికి ఖర్చు పెడుతున్నారని వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.