VZM: పంచాయతీ కార్యదర్శుల పే స్కేల్‌ను తగ్గించిన ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేయాలని పంచాయతీ అభివృద్ధి అధికారులు సంఘం మంగళవారం కోరింది. G.O.Ms.No.91 ప్రకారం నిర్ణయించిన రూ.28,280 బేసిక్ పేను యథావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు నెల్లిమర్ల మండలానికి చెందిన అధికారులు ఎంపీడీవోకు వినతిపత్రం సమర్పించారు.