KDP: జిల్లాలో ట్రాఫిక్ నిబంధనల అమలుపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరి అని ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 253 కేసులు నమోదు చేసి, రూ.57,195 జరిమానాలు విధించారు. రాంగ్ రూట్ డ్రైవింగ్‌పై ప్రత్యేకంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.