SKLM: గార మండలం వమరవల్లిలో నాగుపాము మృతి కలకలం రేపింది. తాగునీరు దుర్వాసన రావడంతో స్థానికులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ క్రమంలో అధికారులు నీటిని సరఫరా ఓవర్ హెడ్ ట్యాంక్ పరిశీలించగా అందులో నాగు పాము చనిపోయి ఉండటాన్ని గుర్తించారు. దీంతో అధికారులు గురువారం నీటి సరఫరా నిలిపివేసి పామును తొలగించారు. ప్రత్యేకంగా క్లోరినేషన్ చేశారు.